Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలేవానలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. వాతావరణ శాఖ సూచనలు

Rain Alert : కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. అయితే, మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Meteorological Department predicted rains for two days in several districts of Telangana

  • తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
  • రెండ్రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన

Rain Alert : రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారంరోజులపాటు ఎడవేడిమి తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read : Inter Students : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కొత్త స్కీంలు వచ్చేస్తున్నాయ్..! వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి..?

కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల వర్షం పడింది. ముఖ్యంగా సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అయితే, రెండు రోజులు (మంగళ, బుధవారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటలకు, తోటలకు నష్టం వాటిళ్లే ప్రమాదముందని, కల్లాల్లో పంటలు ఆరబోసిన రైతులు వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ద్రోణి ప్రభావంతో రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇవాళ రేపు అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతోపాటు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.