Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ముడు రోజులపాటు దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్

Weather Report Today: తెలంగాణలో భారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Meteorological Department stated that heavy rains in Telangana for next three days

  • భారీ వర్షాల ముప్పు ఉంది
  • ఉత్తర జిల్లాల్లో తీవ్ర ప్రభావం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Telangana Rains: బంగాళాఖాతంలో చురుగ్గా మారిన వాతావరణ పరిణామాల కారణంగా తెలంగాణ అంతటా వర్షపాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో రానున్న 72 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వానలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, పరిపాలనా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Also Read – AP Government: ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరినట్టే

వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలు:

ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల(Telangana Rains) తాకిడి కాస్త తీవ్రంగా ఉండనుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలతో పాటు ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదు కావచ్చని అంచనా. అలాగే కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచేగాలులతో కూడిన వానలు పడవచ్చు.

ప్రజలకు, రైతులకు ముఖ్య గమనిక:

భారీ వర్షాలు, వేగవంతమైన గాలుల వల్ల నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడం, చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ముప్పు ఉంది. లోతట్టు ప్రాంతాల నివాసితులు, ప్రయాణికులు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. రైతులు కోసిన పంటలను, వ్యవసాయ ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వర్షం కురిసే సమయంలో చెట్ల కింద గానీ, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో గానీ నిలబడకూడదని అధికారులు స్పష్టం చేశారు.