Life Expectancy: పురుషుల కంటే మహిళల ఆయుర్దాయమే అధికంగా ఉంటోందని కేరళ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. తెలంగాణలో పురుషులు నడివయసులోనే మృతి చెందుతుంటే, మహిళలు 70 ఏళ్లు దాటినా జీవిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడు, కేరళకు సంబంధించి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2022 డేటా ఆధారంగా చేసిన అధ్యయనంలో ఈ వివరాలు తెలిశాయి. అరియాగా అప్రోచ్ విధానంలో ఈ అధ్యయనం చేశారు. ఈ వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి.
పెళ్లీడు వచ్చిందా? సోషల్ మీడియా వాడుతున్నారా? జాగ్రత్త.. ఇండోర్‌లో 40 రోజుల్లో 150 వివాహాలు రద్దు..
ఒకప్పుడు పిల్లల మరణాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన వైద్యం కారణంగా శిశు మరణాలు తగ్గాయి. 45 నుంచి 59 ఏండ్ల వయసు వాళ్లే తెలంగాణలో ఆయుర్దాయ అసమానతలకు ప్రధాన కారణం. ఆ వయసులో మృతి చెందేవారే అధికంగా ఉన్నారు. 20 ఏళ్ల లోపు వారి మరణాలు బాగా తగ్గాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో ఆయుర్దాయం విషయంలో కేరళ అగ్రస్థానంలో ఉంది. పురుషులు సగటున 72, మహిళలు 78 ఏళ్లు జీవిస్తున్నారు. ఆ తర్వాత తమిళనాడులో పురుషులు 71, మహిళలు 75 ఏళ్లు బతుకుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఆయుర్దాయం విషయంలో వెనకబడి ఉన్నాయి.