Seethakka Defamation Case: మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో అవినీతి ఆరోపణలు రావడం దుమారం రేపింది. రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

  • Updated on- May 6, 2026 / 06:56 PM IST

Seethakka Defamation Case: మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది.

సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పోస్టులు ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు తొలగించాలని ఆదేశించింది. CPC ఆర్డర్ 39 రూల్ 3 ప్రకారం తాత్కాలిక నిషేధాజ్ఞలు విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 7కి వాయిదా వేసింది కోర్టు.

మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో అవినీతి ఆరోపణలు రావడం దుమారం రేపింది. రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పిటిషన్‌లో దీనిపై ప్రస్తావించారు. అంగన్‌వాడీ కార్మికుల కోసం 38వేల 130 ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్ ధర రూ.11,650. మొత్తం టెండర్ విలువ రూ.44.42 కోట్లు. తక్కువ ధర కోట్ చేసిన సంస్థకే టెండర్ కేటాయించారు.

Also Read: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ.. మెజార్టీ సంఖ్యపై గవర్నర్ ట్విస్ట్..