MLA Padi Kaushik Reddy : డ్రగ్స్‌తోపాటు మద్యం టెస్టు కూడా చేయాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్

కరీంనగర్ సీపీ అలం గౌస్‌పై కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సీపీ తనకున్న పవర్‌ను ఉపయోగించి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని, సీపీకి జల్సాలు ఎక్కువైయ్యాయంటూ కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

MLA Kaushik Reddy

  • డ్రగ్స్‌తోపాటు మద్యం టెస్టుసైతం చేయాలి
  • ఎవరెవరు ఎంత మద్యం తాగి వచ్చారో తెలుస్తుంది
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
  • కరీంనగర్ సీపీపై తీవ్ర ఆరోపణలు

MLA Padi Kaushik Reddy : మా నాయకుడు కేటీఆర్ పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సవాల్ విసురుతున్నా.. మహేశ్ కుమార్ గౌడ్ సేట్ట్‌మెంట్ ఇచ్చి పారిపోవడం కాదు.. అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారో అప్పుడు తేలుతుంది. డ్రగ్ టెస్టు మాత్రమే కాదు.. మద్యం టెస్టుసైతం అసెంబ్లీలో పెట్టాలి. ఎవరెవరు ఎంత మద్యం తాగి వచ్చారో అప్పుడు తేలుతుంది అంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read: Moinabad Farm House Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు.. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు

కరీంనగర్ సీపీ‌పై ఫైర్ ..
కరీంనగర్ సీపీ అలం గౌస్‌పై కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సీపీ తనకున్న పవర్‌ను ఉపయోగించి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని, సీపీకి జల్సాలు ఎక్కువైయ్యాయంటూ కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బోనాలపల్లి గ్రామంలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేస్తున్నాడు. సీపీ చేసిన ఫైరింగ్‌లో అమృతమ్మ అనే వృద్ధురాల తొడకు గాయమైందని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫైరింగ్ రేంజ్‌లో పోలీస్ మిత్రులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం తప్పులేదు. కానీ, కరీంనగర్ సీపీ తన సతీమణి, ఫ్రెండ్స్ కలిసి ఇష్టమొచ్చినట్లు ఫైరింగ్ చేస్తున్నారు. 180 బుల్లెట్లు ఫైరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేను మాట్లాడేది వాస్తవం. అబద్దం అయితే ముక్కు నేలకు రాస్తానంటూ కౌశిక్ రెడ్డి అన్నారు.

ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..
కరీంనగర్ సీపీ ప్రవేయిట్ వ్యక్తులతో కలిసి ఫైరింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండనే ఉంటుందా? సీపీ‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై ఏంఏం కేసులు ఉన్నాయో బయటకు తియ్యండి అని ఆదేశాలు ఇచ్చే రేవంత్ రెడ్డి.. మరి ఇప్పుడు కరీంనగర్ సీపీ ఇల్లీగల్ వ్యవహారశైలిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మొన్న సీఐడీ అధికారులు నాపై కేసు పెట్టారు. ప్రభుత్వ వాహనాన్ని ప్రవేయిట్ వ్యక్తులు వాడుతుంటే ఆధారాలతో సహ నేను బయటపెట్టాను, ఇంతవరకు వారి పై చర్యలు తీసుకోలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ సీపీ ఎప్పుడు ఫైరింగ్ చేస్తాడో తెలియక
బోనాలపల్లి గ్రామ ప్రజలు బయపడుతున్నారని కౌశిక్ పేర్కొన్నారు.

ఒక్కరిద్దరు IAS , IPS అధికారుల వ్యవహార శైలి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నేను అనని వ్యాఖ్యలకు అన్నట్లు నాపై కేసు నమోదు చేశారు. మత మార్పిడి వ్యాఖ్యలు నేను ఎక్కడా చెయ్యలేదు, నేను చేసినట్లు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. కరీంనగర్ సీపీ గౌస్ మాటలు నమ్మి IPS అధికారుల అసోసియేషన్ క్షమాపణ చెప్పాలని లేఖ రాశారు. ఇప్పటికైన కరీంనగర్ సీపీ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.