Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్‌ను తిట్టడం బాధేసింది.. డిపాజిట్ కూడా దక్కదు.. కవితపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఓ ఉద్యమకారుడి బిడ్డగా కవితకు గుర్తింపు ఉందన్నారు.
- Naveen
- Updated on- April 29, 2026 / 06:26 PM IST
Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవితపై ఆయన ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసి కవిత తన మర్యాదను పోగొట్టుకున్నారని విమర్శించారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని హితవు పలికారు. మొదటి సమావేశంలోనే తండ్రిని కవిత విమర్శించారని అన్నారు. కవితకు ఆధికారం కావాలనే ఆశ ఉండటంలో తప్పులేదన్నారు. కానీ ఉద్యమకారుడు అయిన కేసీఆర్ ను కవిత విమర్శించడం బాధ కలిగించిందన్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఓ ఉద్యమకారుడి బిడ్డగా కవితకు గుర్తింపు ఉందన్నారు. సొంత నియోజకవర్గంలో పోటీ చేసినా కవితకు డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.
”కవిత పార్టీ ఒక జోక్ లా అయిపోయింది. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. కవిత కైనా, కేటీఆర్ కైనా, హరీశ్ రావుకైనా అందరికీ గుర్తింపు వచ్చింది కేసీఆర్ ద్వారానే. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్తా బయటకు వచ్చి పార్టీ పెట్టింది. కవిత పార్టీ పెద్ద జోక్.
ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? తండ్రికి కూతురు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, కూతురికి కూడా తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుంది. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. తన తొలి సమావేశంలోనే కవిత తప్పు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రజలందరూ ఆలోచించుకుంటారు. తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు తల్లి ఎలా అవుతుంది?
నేను చాలా బాధతో చెబుతున్నా. కవిత చాలా తప్పు మాట్లాడింది. మీకు మీ అన్నపై కోపం ఉండొచ్చు. మీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు. దాని కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ కన్నతండ్రిని విమర్శించడం కరెక్ట్ కాదు. తెలంగాణలో మీరు ఏదో చేస్తానంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
