BJP MLA Raja singh Arrested : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబీర్ పురా పోలీస్ స్టేషన్ తో పాటు పలు పీఎస్ లలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.

  • Updated on- August 23, 2022 / 11:30 AM IST

BJP MLA Raja singh Arrested (1)

BJP MLA Raja singh arrested : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మంగళవారం (August 32,2022) అరెస్ట్ చేశారు.  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై డబీర్ పురా పోలీస్ స్టేషన్ తో పాటు పలు పీఎస్ లలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాత బస్తీలో అత్యంత ఉద్రిక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తమ మనో భావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళ చేపట్టారు. పాతబస్తీలోని అన్ని పోలీసు స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు చేశారు. పోలీసు స్టేషన్ల ఎదుట బైఠాయించి అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పోలీసులకు, ప్రజలకు మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్ధరాత్రి బషీర్ బాగ్ లోని పోలీసు కమీషనర్ కార్యాలయం ఎదుట కూడా నిరసన తెలిపారు. ఈక్రమంలో పోలీసులు ఎట్టకేలకు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.