స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు కూతుళ్ల శవాలు.. కేసులో భయంకరమైన ట్విస్ట్.. అసలు ఆ భర్త అలా ఎలా చేశాడు?
Hanumakonda Swimming Pool Incident : హనుమకొండ జిల్లాలో స్విమ్మింగ్ పూల్‌లోపడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
- Harishth Thanniru
- Published On : April 3, 2026 / 09:12 AM IST
Swimming Pool Incident
- స్విమ్మింగ్ పూల్లో తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి ఘటనలో బిగ్ ట్విస్ట్
- ముగ్గురి మరణాల మిస్టరీపై పోలీసుల విచారణ
- భర్త అజారుద్దీనే హంతకుడుగా భావిస్తున్న పోలీసులు
Hanumakonda Swimming Pool Incident : హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్‌లో శవాలై తేలారు. బుధవారం రాత్రి ఐనవోలు మండలం పున్నేలు శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read : Telangana Govt : రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. రెండు లక్షల మందికి శుభవార్త..
వరంగల్ కరీమాబాద్‌కు చెందిన ఫర్హత్ (26) చిన్పప్పటి నుంచి ఐనవోలు మండలం పున్నేలులోని తన పిన్ని వద్ద పెరిగింది. అదే గ్రామానికి చెందిన అజారుద్దీన్ ను ప్రేమించగా.. వారిద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వారికి ఉమేరా (8), అయేషా (6) కూతుళ్లు ఉన్నారు. అజారుద్దీన్ వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని పున్నేలు క్రాస్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు. అయితే, ఫర్షత్, అజారుద్దీన్ కు అబార్షన్ విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. ఫర్హత్ మళ్లీ గర్భదాల్చగా కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకొని అజారుద్దీన్ అబార్షన్ చేయించాడు. ఇలా రెండు సార్లు జరిగింది. అయితే, మూడు నెలల క్రితం ఫర్హత్ మరోసారి గర్భవతి అయింది. ఈసారికూడా అమ్మాయేనని తెలుసుకున్న అజారుద్దీన్.. మళ్లీ అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా ఘర్షణలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం పెద్ద కుమార్తె ఉమేరా పుట్టినరోజు కావడంతో అంతా కలిసి బిర్యానీ తీసుకొని సాయంత్రం స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. అజారుద్దీన్ వాష్ రూంకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ముగ్గూరు స్విమ్మింగ్ పూల్ లో పడి ఉన్నారని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం అజారుద్దీన్ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఫర్హత్ తల్లిదండ్రులు తమ కూతుర్ని, పిల్లలను చంపి అజారుద్దీన్ నీటిలో పడేశాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజారుద్దీన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవటం పలు అనుమానాలకు తావునిస్తోంది. ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ కేసులో భర్త అజారుద్దీనే హంతకుడని పోలీసులు భావిస్తున్నారు. భార్య, ఇద్దరు కూతుళ్లు ఉమెరా, ఆయేషాను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లిన అజారుద్దీన్.. వారిని అందులో ముంచాడు. ఆ తరువాత ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్లాన్ ప్రకారం.. సీసీ కెమెరాలు ఆఫ్‌చేసి ముగ్గురినీ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం నిందితున్ని పోలీసులు మీడియా ముందు హాజరుపర్చే అవకాశం ఉంది.
