Hyderabad Mumbai Bullet Train : హైదరాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే.. ఎక్కడెక్కడ ఏయే స్టేషన్లు వస్తాయంటే..

Mumbai-Hyderabad Bullet Train : కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. వీటిలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికల ప్రక్రియలు వేగవంతమయ్యాయి.

Mumbai Hyderabad Bullet Train Route Finalised Major Boost For Pandharpur And Solapur Development

Hyderabad Mumbai Bullet Train : ముంబై – హైదరాబాద్ మధ్య నడిచే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టు రూట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని పండరీపురం, సోలాపూర్ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఈ హైస్పీడ్ రైలు ద్వారా ముంబై నుంచి ఫుణెకు కేవలం 50 నిమిషాల్లో ప్రయాణించ వచ్చునని సమాచారం.

Also Read : Kerala CM VD Satheesan : కేరళ సీఎంగా వీడి సతీషన్ ప్రమాణ స్వీకారం.. 20మంది మంత్రులు ప్రమాణం.. మాజీ సీఎం విజయన్‌తోపాటు ప్రముఖులు హాజరు..

ముంబై – హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ సుమారు 760 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంటుంది. ఈ మార్గంలో ప్రతిపాదించబడిన ప్రధాన స్టేషన్లలో ముంబై, నవీ ముంబై, లోనావాలా, పూణె, దౌండ్, అక్లూజ్, పండరీపురం, సోలాపూర్, కలబురగి, జహీరాబాద్, హైదరాబాద్ ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ ముంబై, హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రోడ్డు, రైలు మార్గాల ద్వారా ప్రయాణం 14 నుంచి 16గంటల సమయం పడుతుంది. హైస్పీడ్ రైలు మార్గం పూర్తయితే ముంబై నుంచి హైదరాబాద్ నగరానికి కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. ముంబై నుంచి పుణెకు ప్రయాణం కేవలం 48 నిమిషాల్లోనే పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు.

ముఖ్యంగా, భక్తులకు పుణ్యక్షేత్రమైన పండరీపురం‌కు ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ బుల్లెట్ రైలు పండరీపురం, సోలాపూర్ ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు, పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు పరిశ్రమ, వాణిజ్య, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. వీటిలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికల ప్రక్రియలు వేగవంతమయ్యాయి.

ఇదిలాఉంటే .. ముంబై – హైదరాబాద్ బుల్లెట్ రైలుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర, తెలంగాణల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచి తద్వారా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.