Vehicle Registration: వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానం.. ఇక పూర్తిగా ఆన్‌లైన్
డీలర్లు 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్ లాగిన్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
- Naveen
- Published On : March 12, 2026 / 04:22 PM IST
Representative Image (Image Credit To Original Source)
- పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- ఫామ్ 20 సహా అన్ని పత్రాల స్కాన్ కాపీలు మాత్రమే అప్‌లోడ్ చేయాలి
- డీలర్లు 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు
Vehicle Registration: వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానం అమల్లోకి రానుంది. డీలర్ పాయింట్ ద్వారా పేపర్ దరఖాస్తుల విధానం రద్దు కానుంది. మార్చి 13 నుండి పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. ఫామ్ 20 సహా అన్ని పత్రాల స్కాన్ కాపీలు మాత్రమే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇకపై RTA కార్యాలయాలకు ఫిజికల్ పత్రాల సమర్పణ ఉండదు. మార్చి 13 తర్వాత TR పొందిన వాహనాలకు పేపర్ పత్రాలు స్వీకరించరు. పాత TR వాహనాలకు కూడా ఆన్‌లైన్ ద్వారా PR అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు రెండు పని దినాల్లో పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. డీలర్లు 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్ లాగిన్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
Also Read: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వేళ భారత్‌కు భారీ ఊరట.. ఇండియాకు గుడ్‌న్యూస్ చెప్పిన ఇరాన్
