Ts Government: 1,326 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : June 15, 2022 / 07:46 PM IST
Job Notification
Ts Government: వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్యశాఖలో 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్ లో 357 ట్యూటర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోఫిటికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
