×
Ad

Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పవన్ ని ఆయన నివాసంలో కలిశారు.

  • Published On : February 4, 2026 / 06:00 AM IST

Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 6న తెలంగాణలో పలు చోట్ల క్యాంపెయిన్ లో పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పవన్ ని ఆయన నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపైనా డిస్కస్ చేశారు. బీజేపీ తరపున ప్రచారం నిర్వహించాలని కోరగా పవన్ అందుకు అంగీకరించారు. అంతేకాదు జనసేన పార్టీ తరపున బీజేపీకి పూర్తి మద్దతును ప్రకటించారు పవన్ కళ్యాణ్.

తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతుగా జనసేన పార్టీ పని చేయనుందని, బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నట్టు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా మిత్రపక్షాలను కూడా కలుపుకుని వెళ్లేందుకు సిద్ధమైంది. అర్బన్ ఏరియాల్లో జనసేనకు కొంత పట్టుంది. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జనసేన సైతం పోటీ చేస్తోంది. అయినప్పటికీ.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడంతా జనసేన మద్దతును బీజేపీకి ప్రకటించారు. జనసేన మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచనలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉన్నాయి.