PM Kisan-Rythu Bharosa : రైతులకు బిగ్ అలర్ట్ : 8 రోజుల్లో ఈ ఒక్క పని చేయకుంటే పీఎం కిసాన్, రైతుభరోసా బంద్..!
PM Kisan-Rythu Bharosa : తెలంగాణ రైతులకు అలర్ట్.. సెప్టెంబర్ 30లోగా ఫార్మర్ ఐడీ రిజిస్టర్ చేసుకోకపోతే పీఎం కిసాన్, రైతు భరోసా నిలిచిపోనున్నాయి. ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- September 22, 2026 / 06:17 PM IST
PM Kisan-Rythu Bharosa
- ఫార్మర్ ఐడీ లేదా? అయితే రైతు భరోసా డౌటే
- సెప్టెంబర్ 30 డెడ్‌లైన్.. రైతులు మిస్ కావొద్దు
- పథకాలు కావాలంటే ఈ ఒక్క రిజిస్ట్రేషన్ మస్ట్
- చేతిలో సమయం కేవలం ఎనిమిది రోజులే..
- పీఎం కిసాన్, రైతు భరోసా డబ్బులు రానట్టే
PM Kisan-Rythu Bharosa Update : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. చేతిలో ఉన్నది కేవలం 8 రోజులే. ఈలోపు ఒక్క పని పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతు భరోసా లాంటి కీలక పథకాల డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గడువు తేదీలోగా ఫార్మర్ ఐడీని రిజిస్టర్ చేసుకోవడం బెటర్..
ఫార్మర్ ఐడీ ఏంటి? :
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ప్రభుత్వం ప్రతి రైతుకూ ఒక స్పెషల్ డిజిటల్ గుర్తింపు కార్డు జారీ చేస్తోంది. దీన్నే ఫార్మర్ ఐడీ అంటారు. ఇందులో మీ వివరాలను (PM Kisan-Rythu Bharosa) రిజిస్టర్ చేయకపోతే రైతులు అర్హులైనప్పటికీ పథకాల ప్రయోజనాలు అందవు.
సెప్టెంబర్ 30నే లాస్ట్ డేట్ :
ఈ ఫార్మర్ ఐడీ కోసం సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కేవలం 8 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసేలోగా రిజిస్టర్ చేసుకోని రైతులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుంది? :
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (ఏడాదికి రూ. 6వేలు) ఆగిపోవచ్చు
- రైతు భరోసా నిలిచిపోవచ్చు
- పంటల బీమా, రాయితీ ఎరువులు, విత్తనాలు అందవు
- పంట రుణాలు పొందడంలో ఇబ్బందులు
- వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కనీస మద్దతు ధర (MSP) కూడా అందదు.
ఫార్మర్ ఐడీ కోసం ఏం కావాలి? :
భూమి ఉన్న ప్రతి రైతు తన వద్ద ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్ ఉంచుకోవాలి. మీకు సమీపంలోని మీసేవ కేంద్రంలో లేదా గ్రామంలోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO) వద్దకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.
Read Also : Kisan Vikas Patra : మీ డబ్బు డబుల్ చేసే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే! రూ.10 లక్షలకు ఎంత రాబడి వస్తుందంటే?
ఐడీ వచ్చిందో లేదో ఎలా? :
అధికారిక ఆగ్రిస్టాక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తే.. స్క్రీన్‌పై రిజిస్టర్ స్టేటస్ కనిపిస్తుంది.
తెలంగాణతో పాటు దేశంలో మొత్తం 14 రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది. ఆయా రాష్ట్రాల్లో కొత్త రిజిస్ట్రేషన్లకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేశారు. అందుకే గడువు ముగిసేలోగా నమోదు చేసుకోకపోతే పథకాల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి రైతన్నలకు ఇది అత్యవసర గడువు. ఆలస్యం చేస్తే నష్టపోయేది రైతులే కాబట్టి, వీలైనంత త్వరగా దగ్గర్లోని మీసేవ కేంద్రం లేదా AEOని సంప్రదించి ఫార్మర్ ఐడీ రిజిస్టర్ పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది.
