Bandi Sanjay Son : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..

Bandi Sanjay Son : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదయ్యింది.

POCSO Case filed on karimnagar mp bandi sanjay son in hyderabad

  • సంచలన సంఘటన
  • బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
  • మైనర్ బాలికను వేధించాడంటూ ఫిర్యాదు

Bandi Sanjay Son : కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడు వివాదంలో చిక్కుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదయ్యింది. మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బండి సంజయ్ కుమారుడిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు సదరు మైనర్ బాలికకు, బండి సంజయ్ కుమారుడికి మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. బండి సంజయ్ కుమారుడు సదరు మైనర్ బాలికకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను చూపించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం.. బాలిక మైనర్ కావడంతో బండి సంజయ్ కుమారుడిపై పోలీసులకు POCSO చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం.

*ప్రేమ, పెళ్లి పేరుతో రూ.9 కోట్ల మోసం.. బిగ్ బాస్ అషు రెడ్డిపై కేసు నమోదు

ఇదిలా ఉంటే.. బండి సంజయ్ కుమారుడు మాత్రం సదరు మైనర్ బాలికనే తనను హనీట్రాప్ చేసిందని.. డబ్బులు డిమాండ్ చేసిందని.. ఇప్పుడేమో మాట మార్చి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మైనర్ బాలిక కుటుంబం తనను హనీట్రాప్ చేసి.. సుమారు రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపిస్తున్నాడు. సదరు మైనర్ బాలికతో ఉన్న స్నేహం కొద్ది వారి ఇంటికి వెళ్తే ఇప్పుడు ఆ కుటుంబం వారి వద్ద ఉన్న వీడియోలతో తనను బెదిరిస్తున్నారని.. కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. పైగా ఇప్పటికే సదరు బాలిక తండ్రికి రూ. 50 వేల వరకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. బ్లాక్ మెయిల్ చేయిస్తూ.. నగదు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ యువతి తండ్రికి తాను దాదాపు 50 వేలు చెల్లించానని కూడా ఆయన వెల్లడించారు.

* పెళ్లికి ముందు ఇంటి నుంచి పరార్.. కట్ చేస్తే తమ్ముడిని వివాహం చేసుకున్న అక్క.. ఆపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి

ప్రస్తుతం ఈ కేసును రెండు నగరాల పోలీసులు విచారిస్తున్నారు. కరీంనగర్ పోలీసులు భగీరథ్ ఇచ్చిన హనీట్రాప్, బెదిరింపుల ఫిర్యాదు పై దర్యాప్తు చేస్తుండగా.. హైదరాబాద్ పోలీసులు మైనర్ బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసును విచారిస్తున్నారు. అయితే బండి సంజయ్ కుమారుడు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా తోటి విద్యార్థులపై దాడి చేశారంటూ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.