Bandi Bhagirath : బండి భగీరథ్ ను అరెస్ట్ చేశాము.. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట హాజరు..
పోలీసులు బండి భగీరథ్ ను పేట్ బషిరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. (Bandi Bhagirath)
- Saketh U
- Published on- May 16, 2026 / 11:17 PM IST
Bandi Bhagirath
Bandi Bhagirath : మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజు నుంచే భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొద్దీ సేపటి క్రితమే బండి భగీరథ్ పోలీసులుకు లొంగిపోయాడు. బండి సంజయ్ తానే స్వయంగా లాయర్ల ఎదుట పోలీసులకు బండి భగీరథ్ ని అప్పగించానని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.
పోలీసులు బండి భగీరథ్ ను పేట్ బషిరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మేడ్చల్ జడ్జి ఎదుట భగీరథ ని పోలీసులు హాజరు పరచనున్నట్టు సమాచారం.
Also Read : Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్..
ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ రమేష్ మాట్లాడుతూ.. బండి భగీరత్ ను మేము అరెస్ట్ చేశాము. అప్పా జంక్షన్ వద్ద బండి భగీరత్ ను అరెస్ట్ చేసాము అని తెలిపారు. తమ కుమారుడిని పోలీసులకు అప్పగించామని ప్రెస్ నోట్ లో బండి సంజయ్ పేర్కొనడం గమనార్హం. ఈ కేసు సిట్ అధికారిని రితిరాజ్ కూడా పేట్ బషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
