ఓటర్లు లేక నిద్రపోతున్న పోలింగ్ అధికారులు.. వెలవెలబోతున్న పోలింగ్ బూత్‌లు
- Subhan Ali Shaik
- Updated on- December 1, 2020 / 06:02 PM IST
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల ప్రచారం జరిగినంత ఉత్సాహం, జోరు ఓటర్లలలో కనిపించడం లేదు. అమీర్‍పేట్‌లో 48వేలకు పైచిలుకు ఓటర్లు ఉంటే కేవలం 380మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేవారు లేక పోలింగ్ సిబ్బంది నిద్రపోవడం వంతైంది. నగరంలో పలు చోట్ల ఇదే పరిస్థితి.
గతంలో నమోదైన దాని కంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొనగా అసలు ఓటర్లే లేక జూబ్లీ హిల్స్ లాంటి పోలింగ్ బూత్ లు వెలవెలబోతున్నాయి. ప్రముఖులు, సెలబ్రిటీలు మాత్రమే ఓట్ వేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సీపీ హామీ ఇస్తున్నా ప్రజలు ముందుకు రావడం లేదు.
