Ponnam Prabhakar
Ponnam Prabhakar – Congress: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ (Hyderabad) అంటూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు.
10 టీవీతో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ” ఇది ఆయన సొంత అభిప్రాయమా? బీజేపీ అభిప్రాయమా? ఈ విషయాన్ని చెప్పాలి. ఇది ఎన్నికల స్టంట్ గా కనిపిస్తుంది. నేను వ్యక్తిగతంగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే సంతోషిస్తా. అయితే తెలంగాణ హక్కులకు భంగం కలకుండా చూడాలి.
విద్యాసాగర్ రావు డిమాండ్ చేస్తే ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదు? కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు ఏం చేశారు? చర్చకోసం అయితే ఇది మంచి పద్ధతి కాదు. కిషన్ రెడ్డి ఈ వార్తను గతంలో కొట్టిపారేశారు. ఇప్పుడు విద్యాసాగర్ రావు ఇలా మాట్లాడడం అర్ధరహితం ” అని చెప్పారు.
కాగా, మరికొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రజలను మభ్యపెట్టేలా పలు వ్యాఖ్యలు చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Vidyasagar Rao : దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ.. విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు