×
Ad

Pushpa 2 Incident : పుష్ప2 తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. ఏ11గా అల్లు అర్జున్..

Pushpa 2 Incident : పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద గత ఏడాది డిసెంబర్‌లో తొక్కిసలాట ఘటన

Pushpa 2 Incident

Pushpa 2 Incident : పుష్ప -2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద గత ఏడాది డిసెంబర్‌లో తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

Also Read : Rythu Bharosa : తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రైతుభరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?

23మంది నిందితులను చార్జ్‌షీట్‌లో పోలీసులు చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్దారించారు. దీంతో ఛార్జ్‌షీట్‌లో ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యంను చేర్చగా.. ఏ11గా హీరో అల్లు అర్జున్ పేరును చేర్చారు. ముగ్గురు మేనేజర్లు, ఎనిమిది మంది బౌన్సర్లును, నలుగురు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో చేర్చారు.