రాడిసన్ డ్రగ్స్ కేసు.. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్‌ను గుర్తించేందుకు సరికొత్త ప్రయోగం
కోర్టు అనుమతితో క్రోమోటోగ్రపీ పరీక్ష నిర్వహిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి చేసిన క్రోమోటోగ్రఫీ పరీక్ష అవుతుంది.
- Harishth Thanniru
- Published On : March 30, 2024 / 11:19 AM IST
Radisson Hotel Drug Case
Radisson Hotel Drug Case : హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ను గుర్తించేందుకు సరికొత్త ప్రయోగానికి పోలీసులు తెరలేపనున్నారు. కేసులో క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లి కోర్టు అనుమతిని పోలీసులు కోరారు.. అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ హైకోర్టు అనుమతి ఇస్తే.. తెలుగు రాష్ట్రాల్లో క్రోమోటోగ్రఫీ మొదటి పరీక్ష అవుతుంది.
Also Read : Phone Tapping Issue : ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలుంటాయి
రాడిసన్ హోటల్ లో ఫిబ్రవరి 24న డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ లభించాయి. ఆ పార్టీతో సంబంధం ఉన్నట్లుగా మొత్తం 14 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో కేవలం నలుగురికి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రెటీలు పార్టీ జరిగిన చాలారోజులకు విచారణకు హాజరయ్యారు. దీంతో వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు భావిస్తున్నారు. వారి శరీరాల్లో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.
Also Read : Gachibowli Drugs Case : గోవా నుంచి హైదరాబాద్‌కు.. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
క్రోమోటోగ్రఫీ పరీక్షకోసం ఇప్పటికే కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించిన పోలీసులకు అనుమతి లభించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్రోమోటోగ్రఫీ పరీక్షకు అనుమతిస్తే ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నవారు ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకవేళ కోర్టు అనుమతితో క్రోమోటోగ్రపీ పరీక్ష నిర్వహిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి చేసిన క్రోమోటోగ్రఫీ పరీక్ష అవుతుంది.
