RC Transfer: మీ బండిని అమ్మేశారా?.. ఆర్సీ మార్చకపోతే పోలీస్ కేసే.. ఆర్టీఓ కొత్త రూల్స్ ఇవే!

మీ వాహనాన్ని(RC Transfer) అమ్మినప్పుడు తప్పనిసరిగా ఈ పనులు పూర్తి చేయండి.

RC Transfer is mandatory when you sell your vehicle.

  • పాత వాహనం ఆర్సీ మార్చండి.
  • లేకపోతే తీవ్రమైన చట్టపరమైన చిక్కులు.
  • ఆర్టీఓ కార్యాలయంలో పత్రాలు ఇవ్వండి.

RC Transfer: పాత బైక్ గానీ, కారు గానీ లేదా ఇతర ఏ వాహనాలను అమ్మేసినా డబ్బులు చేతికి రాగానే మన బాధ్యత తీరిపోయిందని చాలామంది అనుకుంటారు. కానీ, రవాణా శాఖ రికార్డుల్లో యాజమాన్య మార్పిడి జరగనంత వరకు చట్టప్రకారం ఆ వాహనం పాత యజమాని పేరిటే ఉంటుందని చాలా మంది మర్చిపోతున్నారు. ఆ బండితో ఏదైనా ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ చలాన్లు పడినా లేదా నేరాలకు వినియోగించినా పోలీసులు నేరుగా ఆర్సీ (RC Transfer) లో ఉన్న యజమానికే నోటీసులు పంపుతారు. అందుకే పాత వాహనం అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ (Ownership Transfer) ప్రక్రియ పూర్తి చేయడం అత్యంత కీలకం.

Irumudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల.. శబరిమల భక్తి, పవర్ ఫుల్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్

ఆర్సీ బదిలీ ప్రక్రియ, అవసరమైన పత్రాలు:

వాహనాన్ని అమ్మినవారు, కొనుగోలు చేసినవారు కలిసి ఫారం-29, ఫారం-30 పూర్తి చేసి సంతకాలు చేయాలి. రవాణా శాఖ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకుని ఒరిజినల్ ఆర్సీ, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, ఇన్సూరెన్స్, పీయూసీ (PUC) సర్టిఫికెట్లను ఆర్టీఓ (RTO) కార్యాలయంలో సమర్పించాలి. కొనుగోలుదారుడు ఆర్టీఓ ఆఫీసులో ప్రత్యక్షంగా హాజరై ఫోటో, డిజిటల్ సంతకం, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనంపై ఫైనాన్స్ ఉంటే, బ్యాంకు నుంచి ‘నో డ్యూస్’ లెటర్‌తో పాటు ఫారం-35 సమర్పించి హైపోథికేషన్ తొలగించుకోవాలి.

ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వాహన మార్పిడి విధానం:

వేరే జిల్లాకు చెందిన వ్యక్తి వాహనాన్ని కొనుగోలు చేసినట్టయితే.. ముందుగా బండి రిజిస్టర్ అయిన ఆర్టీఓ నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని, కొత్త జిల్లా ఆర్టీఓ ఆఫీసులో పత్రాలు సమర్పించాలి. అదే వేరే రాష్ట్రం వ్యక్తి కొంటే, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. వాహనంపై ఎలాంటి కేసులు లేవని ధ్రువీకరించిన తర్వాతే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ అనుమతిస్తుంది.