Telangana High Court : హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు భారీ ఊరట.. కమిషన్ రిపోర్టు నిలిపివేత..
Telangana High Court : జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభించింది.
- Harishth Thanniru
- Updated on- April 22, 2026 / 12:13 PM IST
Relief For Kcr And Harish Rao In Telangana High Court
- కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు
- నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దని ఆదేశం
Telangana High Court : జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు సూచించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొంది. ఇదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది.
Also Read : రైతుభరోసాపై ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కమిషన్‌ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె. జోషిలు తెలంగాణ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. తీర్పును ఈనెల 8వ తేదీన వెలువరిస్తామని ప్రకటించినా.. సాధ్యంకాకపోవటంతో ఈనెల 22కు వాయిదా వేసింది. దీంతో తాజాగా.. బుధవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.
కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఘోష్ కమిషన్ పై ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తెలిపింది. కోర్టు తీర్పుపై ఇరిగేషన్ శాఖ సమాలోచనలు చేస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తుంది. మధ్యాహ్నం 2గంటల తరువాత మీడియా ముందుకు వచ్చి హైకోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా జరిగింది..
- 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు
- 16 నెలలపాటు విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- 2025 జూలై 31న ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కమిషన్
- మూడు వాల్యూమ్ లు, 660 పేజీలతో నివేదిక
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నిపుణుల కమిటీ సూచనలు పట్టించుకోకుండా కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారన్న పీసీ ఘోష్ కమిషన్
- సీడబ్ల్యూసీ అనుమతులు రాకముందే పనులు ప్రారంభించారన్న కమిషన్
- కేసీఆర్, హరీశ్ రావు, ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లే వైఫల్యమన్న కమిషన్
- జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణకు సర్కార్ సిఫార్సు
- నిర్మాణ వ్యయం అంచనాలకంటే 186శాతం అధికంగా ఖర్చు చేశారని రిపోర్టులో పేర్కొన్న కమిషన్
- 2023 అక్టోబర్ లో బ్యారేజీలు దెబ్బతినడానికి నిర్మాణ లోపాలే కారణమని వెల్లడి
