Digital Arrest: హైదరాబాద్ లో ‘డిజిటల్ అరెస్ట్’ కలకలం.. రూ.85 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. చివర్లో ట్విస్ట్ సూపర్
హైదరాబాద్ నగరంలో ‘డిజిటల్ అరెస్ట్(Digital Arrest)’ పేరిట ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని మోసగించిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
- V Santhosh Kumar
- Published on- August 26, 2026 / 02:44 PM IST
Retired bank employee digital arrest 85 lakh freeze
- ఎన్ఐఏ పేరిట డిజిటల్ అరెస్ట్
- వృద్ధుడి నుండి లక్షల స్వాహా
- డబ్బును ఫ్రీజ్ చేసిన పోలీసులు
Digital Arrest: హైదరాబాద్ నగరంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని మోసగించిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 85 ఏళ్ల వయసున్న బాధితుడికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారినని పరిచయం చేసుకున్న ఒక సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. బాధితుడి ఆధార్ కార్డ్ వివరాలతో రూ. 2.50 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని, తక్షణమే అరెస్ట్ చేస్తామని తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆ వృద్ధుడు సైబర్ కేటుగాళ్ల (Digital Arrest)మాటలు నమ్మి మోసపోయాడు.
Tirupati: తిరుపతిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా?
ఆర్బీఐ వెరిఫికేషన్ పేరిట రూ. 85.20 లక్షలు స్వాహా:
ఈ కేసు నుండి బయటపడాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేటుగాడు నమ్మబలికాడు. తన ఖాతాలో రూ. 85.20 లక్షలు జమ చేయాలని సూచించగా, బాధితుడు ఆ మొత్తాన్ని సదరు ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత కేటుగాడు మరో రూ. 42 లక్షలు పంపాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు.
కోయంబత్తూరు ఖాతా ఫ్రీజ్, బాధితుడికి ఊరట:
ఫిర్యాదు స్వీకరించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాల సహాయంతో కోయంబత్తూరులోని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్‌లో ఉన్న నిందితుడి ఖాతాను గుర్తించి, అందులోని రూ. 85.20 లక్షల మొత్తాన్ని పూర్తిగా ఫ్రీజ్ చేశారు. ఈ సందర్బంగా TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
