Revanth Reddy: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం.. బీఆర్ఎస్ ఎన్ని అడ్డుగోడలు పెట్టినా పడగొడతాం: రేవంత్ రెడ్డి
ఖమ్మంలో జూలై 2న జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : June 30, 2023 / 03:16 PM IST
Revanth Reddy (Photo : Twitter)
Revanth Reddy – Congress: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం (Khammam) లో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి చేస్తోన్న ఏర్పాట్లను సమీక్షించేందుకుఅక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఖమ్మంలో జూలై 2న జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్ని అడ్డుగోడలు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు వాటినిపడగొట్టి ఖమ్మం సభకు హాజరవుతారని అన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర తెలంగాణ కోసమేనని చెప్పారు. పాదయాత్రలోని అంశాలే కాంగ్రెస్ మేనిఫెస్టోగా ఉంటాయని చెప్పారు. ప్రజల కష్టాలను భట్టి విక్రమార్క దగ్గర నుంచి చూశారని అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ చూపిస్తున్న భ్రమల్ని భట్టి పాదయాత్ర పటాపంచలు చేసిందని చెప్పారు.
కేసీఆర్ చేతిలో మోసపోయిన బాధితులను భట్టి విక్రమార్క కలిశారని అన్నారు. వారికి భరోసా కల్పించారని తెలిపారు. కేసీఆర్ చేసిన అన్ని రకాల మోసాలను భట్టి విక్రమార్క ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగారని తెలిపారు. కాగా, తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో రేవంత్ భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లురవి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
Etela Rajender : వయసు, అనుభవం ఉన్నవారు ఏదీ పడితే అది మాట్లాడొద్దు : జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్
