Revanth Reddy Swearing Ceremony : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం చేశారు.

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 07 Dec 2023 02:16 PM (IST)

    మాట నిలుపుకున్న సీఎం రేవంత్

    సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు.
    ఇచ్చిన హామీ మేరకుదివ్యాంగురాలు రజనికి ఉద్యోగం ఇస్తూ మరో ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు.
    ఉద్యోగ నియామక పత్రాన్ని రజనికి రేవంత్ రెడ్డి స్వయంగా అందించారు.

  • 07 Dec 2023 02:14 PM (IST)

    ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  • 07 Dec 2023 02:04 PM (IST)

    రేవంత్ మాట్లాడుతూ..

    దశాబ్ద కాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు లోనైంది.
    మానవ హక్కులకు భంగం కలిగింది.
    ఈ ప్రాంతం సమస్యలు చెప్పుకోవటానికి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.

    తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైంది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది.
    ఈ మంత్రి వర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది.
    ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అబివృద్ధి జరుగుతుంది.
    ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడు.. ప్రగతి భవన్ వద్ద గడీలకు నిర్మించుకున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టాం.

    రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్న..  ప్రగతి భవన్ చుట్టూత ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా ప్రగతి భవన్ కు వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. మీ ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు.

    రేపు ఉదయం 10గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహిస్తాం.
    మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతీఒక్కరి హక్కులను కాపాడటానికి, శాంతి భద్రతలను కాపాడుతూ పాలన సాగిస్తాం.  ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీపడేలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం.
    పేదవాళ్లకు, నిస్సహాయులకు మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా.
    ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ అండతో మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ సూచనలతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తాం.
    మీకు మేము సేవకులంగా పనిచేస్తాం. మీరిచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా.

    ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.

  • 07 Dec 2023 02:02 PM (IST)

    జే సోనియమ్మ జైజై సోనియమ్మ అంటూ నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

  • 07 Dec 2023 02:00 PM (IST)

    సోనియా గాంధీ పాదాలకు నమస్కారం చేసిన రేవంత్ రెడ్డి దంపతులు

  • 07 Dec 2023 01:54 PM (IST)

    ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం..

    ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసింది. 1.21 గంటలకు రేవంత్ రెడ్డి  సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 1.21 గంటల నుంచి 1.50 గంటల వరకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. తొలుత మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయగా.. చివరిగా జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 07 Dec 2023 01:52 PM (IST)

    ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్, మంత్రులు గ్రూప్ ఫొటో

  • 07 Dec 2023 01:48 PM (IST)

    సోనియాగాంధీకి పాదాభివందనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.

    కుటుంబ సభ్యులను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు పరిచయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  • 07 Dec 2023 01:46 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు

    ప్రమాణ స్వీకారం అనంతరం సోనియాగాంధీకి పాదాభివందనం చేసిన జూపల్లి

     

  • 07 Dec 2023 01:44 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు

  • 07 Dec 2023 01:41 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క

     

  • 07 Dec 2023 01:39 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ

  • 07 Dec 2023 01:37 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్

  • 07 Dec 2023 01:35 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • 07 Dec 2023 01:33 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • 07 Dec 2023 01:31 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • 07 Dec 2023 01:29 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దామోదర రాజనర్సింహ

  • 07 Dec 2023 01:29 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • 07 Dec 2023 01:25 PM (IST)

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క.

    ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు అభివాదం చేసిన రేవంత్, భట్టి విక్రమార్క

    Revanth Bhatti

  • 07 Dec 2023 01:21 PM (IST)

    కాంగ్రెస్ శ్రేణుల హర్షధ్వానాల మధ్య తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్  రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

    1.21 నిమిషాలకు రేవంత్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై

    ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపిన గవర్నర్

     

  • 07 Dec 2023 01:17 PM (IST)

    ఎల్బీ స్టేడియం కు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి

  • 07 Dec 2023 01:16 PM (IST)

    రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు

  • 07 Dec 2023 01:15 PM (IST)

  • 07 Dec 2023 01:10 PM (IST)

    ఎల్బీ స్టేడియంలో సభావేదిక వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.

  • 07 Dec 2023 01:08 PM (IST)

    ఎల్బీ స్టేడియంలో సోనియాగాంధీతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ వేదిక వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి

  • 07 Dec 2023 01:00 PM (IST)

    ఎల్బీ స్టేడియంకు చేరుకున్న రేవంత్ రెడ్డి.. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్.

    ఎల్బీ స్టేడియంకు చేరుకున్న రేవంత్ కుటుంబ సభ్యులు

  • 07 Dec 2023 12:57 PM (IST)

  • 07 Dec 2023 12:43 PM (IST)

    తాజ్ కృష్ణ నుంచి ఎల్బీ స్టేడియంకు భారీ కాన్వాయ్ తో బయలుదేరిన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.

    ఒకే వాహనంలో బయలుదేరిన రేవంత్, రాహుల్, ప్రియాంక.

  • 07 Dec 2023 12:16 PM (IST)

    ప్రత్యేక బస్సు ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో వారికి కేటాయించిన స్టేజీపై ఎమ్మెల్యేలు ఆసీనులైయ్యారు.

  • 07 Dec 2023 12:10 PM (IST)

  • 07 Dec 2023 11:59 AM (IST)

    తాజ్ కృష్ణ కు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క. సోనియా, రాహుల్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన భట్టి.

  • 07 Dec 2023 11:57 AM (IST)

    12.45 గంటలకు ఎల్బీ స్టేడియంకు రేవంత్

    మధ్యాహ్నం 12. 45 గంటలకు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు.
    12.55 గంటలకు గవర్నర్ తమిళిసై ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు.
    1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.
    1.25 గంటలకు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
    చివరగా గవర్నర్, సీఎం మంత్రి మండలితో గ్రూప్ ఫొటో దిగుతారు.

  • 07 Dec 2023 11:50 AM (IST)

    మల్లు భట్టి విక్రమార్క తన నివాసంలోని పూజ గదిలో ఇవాళ ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు.

  • 07 Dec 2023 11:37 AM (IST)

    హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్విందర్. శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి.

  • 07 Dec 2023 11:36 AM (IST)

    ఎల్బీ స్టేడియంకు ఎమ్మెల్యేలు

    గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియంకు బయలుదేరారు. మరికొద్ది సేపట్లో వారు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు.

  • 07 Dec 2023 11:32 AM (IST)

    ప్రజలకు అభివాదం చేసుకుంటూ..

    రేవంత్ రెడ్డి ప్రజల మధ్య నుండి ఎల్బీ స్టేడియం లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గేట్ నంబర్ 8 నుండి ఓపెన్ టాప్ జీపు పై ప్రజలకు అభివాదం చేస్తూ రేవంత్ వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డిచేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

  • 07 Dec 2023 11:29 AM (IST)

    పెద్దమ్మగుడిలో పూజల అనంతరం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంకు వెళ్లనున్నారు. మార్గం మధ్యలో గన్ పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించనున్నారు.

  • 07 Dec 2023 11:27 AM (IST)

  • 07 Dec 2023 11:25 AM (IST)

    సొోనియా, రాహుల్ కు ఘన స్వాగతం..

  • 07 Dec 2023 11:23 AM (IST)

    రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, పలు రాష్ట్రాల కీలక నేతలు పాల్గోనున్నారు. ఇప్పటికే సోనియా, రాహుల్, ప్రియాంకలు హైదరాబాద్ చేరుకున్నారు.

  • 07 Dec 2023 11:21 AM (IST)

    మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది. రాజ్ భవన్ కు చేరిన మంత్రుల లిస్ట్.

  • 07 Dec 2023 11:20 AM (IST)

    ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మేధావులు, ఉద్యమ కారులకోసం 250 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.

  • 07 Dec 2023 11:17 AM (IST)

    తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్న ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు

  • 07 Dec 2023 11:17 AM (IST)

    పెద్దగుడికి రేవంత్ ..

    మరికాసేపట్లో పెద్దమ్మ గుడికి సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. కుటుంబంతో కలిసి పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇప్పటికే ఆలయ నిర్వాహకులు పెద్దమ్మ గుడిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు