×
Ad

RS Praveen Kumar : రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు బలికాకండి.. అంతా డైవర్షన్ పాలిటిక్స్..

RS Praveen Kumar : తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

RS Praveen Kumar

RS Praveen Kumar : దేశ భద్రత కోసం, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం నాకు తెలుసు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీఎం రేవంత్  రెడ్డి బజారున పడేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దీని పైన వీరోచితంగా కేటీఆర్, హరీష్ రావు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు పైన అక్రమ కేసులు పెట్టినప్పటికీ మడమ తిప్పకుండ వీరోచితంగా పోరాడుతున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Also Read : Gold and Silver Rates Today : ఓరి దేవుడా.. రాత్రికిరాత్రే సీన్ రివర్స్.. ఏకంగా రూ.20వేలు.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు..

తెలంగాణ సంపదను నైనీ కోల్డ్ బ్లాక్ దోచుకుంటుంది. దీనిపైన బీఆర్ఎస్ మాట్లాడితే రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కూల్చివేసింది. దీన్ని డైవర్ట్ చేసేందుకు కమిషన్ వేశారు. ఈ ఫార్ములా కారు రేస్‌లో  సిట్ పేరుతో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అలానే ఫోన్ ట్యాపింగ్ కేసు లేకున్నా.. సిట్ పేరుతో కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దంగా జరుగుతుంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి దేశ భద్రతకోసం, టెర్రరిస్టుల నెంబర్స్‌ను ట్యాపింగ్ చేస్తారు. దేశ భద్రతకోసం ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తుంది. దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని ఆనాడు ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారికంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ గోప్యంగా పోలీసులు మాత్రమే చేస్తారు. ఈ విషయంపై ఏ రాష్ట్రంలో చర్చ జరగడం లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. హోం మంత్రికి కూడా. ఎస్ఐబీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అంతటి రహస్యంగా ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ వ్యవస్థలు ఉంటాయి. కానీ, రేవంత్ రెడ్డి వికృత రాజకీయ క్రీడలకు అలాంటి వ్యవస్థలను దిగజార్చుతున్నారు. ప్రమోషన్‌లకోసం రేవంత్ రెడ్డి వికృత క్రీడలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు గెస్ట్ హౌస్‌లలో దోపిడీ చేస్తున్నారు. తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. కుట్ర పూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో 350 మందిని విచారించారు. అందులో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని విచారణలో తేలింది. విచారణ సమయంలో పోలీస్ కానిస్టేబుల్‌ను బెదిరించారు. అయిన ఏ ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పలేదు. కావాలనే మరోసారి సిట్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్‌ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారు. ఈ కేసును విచారించే అధికారం సజ్జనార్‌కు లేదని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సజ్జనార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక హక్కు
సజ్జనార్, శివధర్ రెడ్డిలకు లేదు. విచారణ చేస్తే ఇప్పుడున్న మంత్రులను విచారించాలి, మంత్రుల అక్రమాలు ఎక్కువయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ పేరుతో లేనిపోని సంబంధాలు కట్టబెడుతున్నారు. చట్టపరంగా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం జరిగినట్లు అనుమానం ఉంటే.. ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులను విచారణ చెయ్యాలి. నాయకులకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి సంబంధం ఉండదని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు బలికాకండని సూచించిన ప్రవీన్ కుమార్.. కేటీఆర్‌ను విచారణకు పిలవడాన్ని తీవ్రంగా ఖండించారు. లోతైన విచారణ జరిగితే సజ్జనార్ పైన జరగాలి, ఎందుకంటే , సజ్జనార్ పై  ఏడు కేసులు ఉన్నాయి. ఆయన సిట్ చీఫ్‌గా ఉండటమేంటీ? కేంద్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని అమిత్ షా చెప్పగలరా.. అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకైనందువల్లే రేవంత్ దౌర్జన్యాల మీద బీజేపీ మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు.