Road Accident : హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8ఏళ్ల బాలుడుసహా నలుగురు మృతి

Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident in Nalgonda district

  • నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
  • కారులోని ప్రయాణిస్తున్న నలుగురు మృతి

Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడుతోసహా నలుగురు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కాకినాడకు చెందిన వారని, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది.

Also Read : Narendra Modi: ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం.. పర్యటనకు ముందే మోదీకి బెదింపులు.. ఇరు దేశాల రక్షణ వర్గాల హై అలర్ట్

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారును చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలోకి రాగానే.. అదే మార్గంలో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన కారును క్రెయిన్ సహాయంతో పక్కకు తప్పించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా కాకినాడ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే, వీరు ఎక్కడి నుండి వస్తున్నారు..? అనే విషయాలపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.