Maripeda SI Suspend : మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు .. మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్
మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
- bheemraj
- Published On : August 4, 2021 / 08:07 AM IST
Maripeda Si Suspend
Maripeda SI Suspend : మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐజీ నాగిరెడ్డికి ప్రాథమిక నివేదిక చేరింది.
నివేదిక పరిశీలించిన తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలివ్వాలని ఐజీ నాగిరెడ్డి.. మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డిని ఆదేశించారు. ఐజీ ఆదేశాల మేరకు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మరిపెడ ఎస్ఐపై మహిళా ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.
రాత్రి స్టేషన్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడి చేశాడని…ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై వరంగల్ సీపీ తరుణ్ జోష్ కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలకు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ వాపోయారు. దీనిపై సత్వర విచారణకు ఆదేశించి సీపీ చర్యలు తీసుకున్నారు.
