Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్ స్లీపర్’కు గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లోనే ప్రయాణం
ఏపీ, తెలంగాణ మీదుగా సరికొత్త 'వందే భారత్ స్లీపర్(Vande Bharat Sleeper)' రైలును ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది.
- V Santhosh Kumar
- Updated on- June 19, 2026 / 04:43 PM IST
South Central Railway has given green signal to Vande Bharat sleeper train connecting Secunderabad and New Delhi.
-
సికింద్రాబాద్-ఢిల్లీ వందే భారత్ స్లీపర్.
-
రాత్రి ప్రయాణాలు మరింత సుఖమయం.
-
శరవేగంగా కొత్త రైళ్ల తయారీ.
Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సరికొత్త కానుకను అందించబోతోంది. ఏపీ, తెలంగాణ మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ చైర్ కార్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రయాణికుల చిరకాల కోరికను తీరుస్తూ సికింద్రాబాద్ – న్యూఢిల్లీ మార్గంలో సరికొత్త ‘వందే భారత్ స్లీపర్(Vande Bharat Sleeper)’ రైలును ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇది ఎంతో ఊరట కలిగించే అంశం.
Cm Chandrababu Naidu: సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం
సరికొత్త టెక్నాలజీ.. కుదుపుల్లేని ప్రయాణం:
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లలో కేవలం కూర్చొని ప్రయాణించే సదుపాయం మాత్రమే ఉంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించే వారు కొంత అలసటకు గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం స్లీపర్ కోచ్‌లను శరవేగంగా తయారు చేయిస్తోంది. ఈ సరికొత్త రైళ్లలో ఎలాంటి శబ్దాలు కానీ, కుదుపులు కానీ లేకుండా ప్రయాణికులు హాయిగా నిద్రపోతూ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ‘హౌరా-గువహతి’ తొలి స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది.
మరిన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ:
భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రముఖ నగరాలను కలుపుతూ ఈ స్లీపర్ రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్ – ఢిల్లీ రూట్‌తో పాటు రానున్న రోజుల్లో పట్టాలెక్కబోయే మరికొన్ని ముఖ్యమైన మార్గాలు ఇవే:
* న్యూఢిల్లీ – శ్రీనగర్, న్యూఢిల్లీ – చెన్నై
* ముంబై – అహ్మదాబాద్, ముంబై – బెంగళూరు
* న్యూఢిల్లీ – పుణె, న్యూఢిల్లీ – హౌరా
రైలు సెట్ల తయారీ పూర్తయిన వెంటనే వీటిని విడతల వారీగా ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్ల రాకతో తెలుగు రాష్ట్రాల ప్రజల సుదీర్ఘ ప్రయాణాలు మరింత సుఖమయం కానున్నాయి.
