special train
Special Trains : దేశవ్యాప్తంగా హోలీని ఘనంగా జరుపుకుంటారు. రంగులు చల్లుకుంటూ చిన్నారులు, పెద్దలు సందడి చేస్తారు. అయితే, హోలీ పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హోలీ పండుగ వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
Also Read : India US trade deal : భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు.. ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల
హోలీ పండుగను పురష్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి 160 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని సీపీఆర్ఓ ఎ. శ్రీధర్ తెలిపారు. మార్చి నెలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని, ప్రధాన ప్రాంతాలకు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు.
విశాఖపట్టణం, పాట్నా, రాజ్‌కోఠ్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, నహర్‌లాగున్, హజ్రత్ నిజాముద్దీన్, శాలిమార్, హిసార్, లక్నో, సంత్రాంగచి, మాల్దాటౌన్, ఛాప్రా తదితర ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయి. ఆయా ప్రాంతాల నుంచి రిటర్న్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. పండుగకు ప్రయాణీకులు రద్దీ తగ్గించేందుకు స్పెషల్ రైళ్లు ఉఫయోగపడతాయని అన్నారు.
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా భారత రైల్వే హోలీ పండుగకు రికార్డు స్థాయిలో దాదాపు 1500 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ననడపుతున్నట్లు పేర్కొంది.