Mohan Babu Family Clashes : పెదరాయుడి ఇంట్లో ఏం జరుగుతోంది? మోహన్ బాబు, మనోజ్ మధ్య అసలు వివాదం ఏమిటి?

ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేక కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అవుతుందా?

Mohan Babu Family Clashes : పెదరాయుడి ఇంట్లో ఏం జరుగుతోంది? మోహన్ బాబు, మనోజ్ మధ్య అసలు వివాదం ఏమిటి?

Updated On : December 12, 2024 / 1:22 AM IST

Mohan Babu Family Clashes : నటుడు మంచు మోహన్ బాబు ఇంటి గుట్టు రచ్చ కెక్కింది. ట్విస్ట్ ల మీద ట్విస్టులు. మోహన్ బాబు, మనోజ్.. ఎవరి వెర్షన్ వారిదే. ఫ్యామిలీ తగాదా కాస్తా బజారున పడింది. పెద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. తండ్రీ కొడుకుల మధ్య వివాదంలో సినిమాను మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, కాంట్రవర్సీ స్టేట్ మెంట్లు.. ఇలా కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు ఇంటి పంచాయితీ ఇప్పుడు వీధిన పడింది. ఇంతకీ అసలు వివాదం ఏమిటి? పెదరాయుడి ఇంట్లో ఏం జరుగుతోంది?

మోహన్ బాబు.. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి మెగాస్టార్, రజనీకాంత్ జనరేషన్.. ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలామందితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విలక్షణ నటుడు. ఇప్పటికీ ఇంకా తన నటనతో స్క్రీన్ పై మెప్పిస్తున్నారు. కలెక్షన్ కింగ్ గా డైలాగ్ డిక్షన్ లో తనకంటూ ఒక స్టైల్, మంచి పేరు ఉంది. ఆయన వారసులుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ఇంటి పేరుపై వివాదాల మచ్చ పడింది. కారణం ఏదైనా కావొచ్చు.. సెలెబ్రిటీ కుటుంబ వ్యవహారం కాస్తా.. ఇలా పెదరాయుడి పంచాయితీగా మారింది. దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అవుతుందా?

Also Read : వంగవీటి రాధాకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? రాధాను పొలిటికల్ వెపన్‌గా మారుస్తారా?