Gossip Garage : వంగవీటి రాధాకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? రాధాను పొలిటికల్ వెపన్‌గా మారుస్తారా?
అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబుతో భేటీ జరిగినట్లు చెప్తున్నారు. త్వరలోనే శుభవార్త వస్తుందని రాధా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Gossip Garage Bumper Offer To Vangaveeti Radha (Photo Credit : Google)
Gossip Garage : ఫాదర్ నుంచి వచ్చిన బ్రాండ్. ఆ పేరునే ఆయన కంటిన్యూ చేస్తున్నారు. 20ఏళ్లుగా లైమ్‌టైట్‌లో ఉంటున్నా..ఆయనెప్పుడు పదవుల వెంట పడలేదు. పదవులు కూడా ఆయన చెంతకు చేరలేదు. ఏ పార్టీలో ఉన్నా..ఏ నేతతో సఖ్యతతో ఉన్నా..ఆత్మగౌరవమే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటారు ఆ లీడర్. సడెన్‌గా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం సీఎం చంద్రబాబు అతడ్ని పిలిచి మరీ మాట్లాడటమే. వంగవీటి రాధాకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి.? రాధాను పొలిటికల్ వెపన్‌గా మారుస్తారా.? అంతా అనుకున్నట్లుగా జరిగితే రాధాకు రాజకీయ మహర్దశ పట్టబోతోందా.?
సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీపై ఆసక్తికర చర్చ..
ఏపీ పాలిటిక్స్‌లో ఆయనో సెన్సేషన్. ఎప్పుడూ ఎంపీ, ఎమ్మెల్యే అవ్వకపోయినా ..ఆయన పేరు మాత్రం వార్తల్లో ఉంటుంది. అతడే వంగవీటి రాధా. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది న్యూస్ అయిపోయారాయన. సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. చంద్రబాబే పిలిచి మరీ రాధాతో మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రాధా, చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
రాధా బ్రాండ్ ఇమేజ్, ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యం..
కాపు సామాజికవర్గంలో ప్రముఖంగా ఉన్న వంగవీటి రాధాను, టీడీపీ మరింత బలమైన నేతగా నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తుందట. వంగవీటి రంగా కుమారుడిగా రాధా.. కాపు వర్గానికి ఐకాన్‌గా ఉన్నారు. దాంతో రాధా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గంలో మరింత పట్టు సాధించేందుకు టీడీపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు టాక్. వంగవీటి బ్రాండ్‌ను ఉపయోగించుకుంటూ రాధాకు మంచి రాజకీయ భవిష్యత్తును సృష్టించాలన్నది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు. రాధాకు ఉన్న బ్రాండ్ ఇమేజ్..ఆయన తండ్రికి ఉన్న ఇంపార్టెన్స్, వాళ్ల ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని.. అతడికి ప్రయారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. రాధాకు పదవులు ఇస్తే కాపు వర్గం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందని..అది పార్టీకి కలసి వస్తుందని భావిస్తోందట టీడీపీ. అందులో భాగంగానే రాధాకు రాజకీయ మహర్దశ పట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారని ఊహాగానాలు..
2025 మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. రాధాకు కీలకమైన హామీ పొందే దిశగా భేటీ కొనసాగగా, టీడీపీ ఆయనను భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా నిలపాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి లభిస్తే, రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిత్వ బాధ్యతలు కూడా ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే సీటు దక్కపోయినా.. కూటమికి మద్దతుగా ప్రచారం..
2019 ఎన్నికల ముందే వంగవీటి రాధాకు టీడీపీ ఎమ్మెల్సీ సీటును ఆఫర్ చేసిందట. కానీ ఆయనే సున్నితంగా తిరస్కరించారన్న ప్రచారం ఉంది. అప్పుడు ఆ స్థానం పరుచురు అశోక్ బాబుకి ఇచ్చారని చెప్తుంటారు. తర్వాత 2024 ఎన్నికలకు ముందు రాధా తమ పార్టీలోకి వస్తారని వైసీపీ కలరింగ్ ఇచ్చింది. కానీ రాధా పార్టీ మారే ఆలోచనే చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా..కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. దాంతో బాబు ఆయనను మంచి హోదాలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారట.
రాధాకు రాజకీయంగా మంచి రోజులు..
ఏపీ పాలిటిక్స్‌లో సెన్సేషన్‌గా ఉన్న వంగవీటి రాధా..తండ్రి వారసత్వంగా వచ్చిన పేరును అలానే కంటిన్యూ చేస్తున్నారు. ప్రతీసారి ఎన్నికలప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉంటారు. విజయవాడ ఎంపీ, సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆయనకు ఇప్పటివరకు ఏ పార్టీ టికెట్ దక్కింది లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు. అయితే ఇప్పుడు పదవులు రాధాను వెతుక్కుంటూ రాబోతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న ఫ్యూచర్ ప్లాన్‌తో రాధాకు రాజకీయంగా మంచి రోజులు రాబోతున్నయన్న టాక్ వినిపిస్తోంది.
రాధాకు ప్రాధాన్యత ఇవ్వాలని లోకేశ్ ను కోరిన తల్లి..
అయితే ఇటీవల రాధా కొంత అనారోగ్యానికి గురికావడంతో.. అందరూ ఆందోళన చెందారు. అప్పుడు నారా లోకేష్ కూడా రాధా ఇంటకెళ్లి పరామర్శించారు. ఈ భేటీలో రాధాకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలంటూ తల్లి రత్నకుమారి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారట. లోకేశ్ కూడా సానుకూలంగా స్పందిస్తూ..రాధా పార్టీ కోసం పనిచేశారని, తగిన గుర్తింపు ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారట. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబుతో భేటీ జరిగినట్లు చెప్తున్నారు. త్వరలోనే శుభవార్త వస్తుందని రాధా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Also Read : మెగా బ్రదర్ నాగబాబుకి మెగా శాఖ దక్కేనా?