Telangana Elections: తెలంగాణలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. మే నెలలోనే పోలింగ్..!

గత డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

  • Published on- April 18, 2026 / 05:38 PM IST
  • త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
  • ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు

 

Telangana Elections: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గత డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మే నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించడం.. ఈ పరిణామాలు చూస్తుంటే అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు.

Also Read: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. ఆ ప్రాంతాల మీదుగా వీక్లీ ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..