Telangana Government : MMTS ఉచిత రైలు ప్రయాణం.. సోషల్ మీడియాలో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ..
Telangana Government : ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయి.
- Harishth Thanniru
- Published on- April 20, 2026 / 11:50 AM IST
Telangana Government
- MMTS రైళ్లలో ఉచిత ప్రయాణం
- సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం
- తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయని వెల్లడి
Telangana Government : నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రాతిపదికన ఏడాది పాటు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రాతిపాదనలు పంపించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదలను దక్షిణ మధ్య రైల్వే కొట్టిపారేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్ విభాగం వివరణ ఇచ్చింది.
Also Read : Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వానికి రైల్వేశాఖ కీలక ప్రతిపాదన
ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయి. ఇంతలో, ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణంపై దక్షిణ మధ్య రైల్వేకు అధికారికంగా ప్రతిపాదనను కూడా సమర్పించడం జరిగింది. ఈ ప్రతిపాదనను, తెలంగాణ ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (HMA), పట్టణాభివృద్ధి శాఖ సమర్పించాయని తెలిపింది.
ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం అమలు చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో కూడిన ఒప్పందాన్ని (MoU) సమర్పించమని దక్షిణ మధ్య రైల్వే కోరినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు, ప్రయాణీకుల సంఖ్య, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని రైళ్లను నడుపుతున్నామని, ప్రస్తుతానికి ఈ విషయమై తదుపరి చర్యల కోసం రైల్వే బోర్డు ఆమోదానికి పంపాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఉచిత ప్రయాణం అంశం ప్రస్తుతం పరిశీలనలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఎన్ని రైళ్లను నడపాలి, ఏ సమయాల్లో ఈ రైళ్లను నడపాలి, ఎంఎంటీఎస్ స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు అన్నీ కూడా రైల్వే బోర్డు నిబంనధల ప్రకారం కల్పించబడతాయని, వీటన్నింటిపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం కేవలం దక్షిణ మధ్య రైల్వే ఉంటుంది. రైల్వే బోర్డుకు పంపే తుది ప్రతిపాదనలో అన్ని అంశాలను చేర్చి పంపించాలి. అనంతరం ఈ విషయంలో ఒక తుది నిర్ణయం వెలువడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రజలు, ప్రయాణికులు సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలను నమ్మొద్దు.. వాటిని ప్రచారం చేయొద్దు. ఎంఎంటీసీ రైళ్లలో ఉచిత ప్రయాణం విషయంపై ప్రభుత్వం తరపున ఎప్పటికప్పుడు అధికారికంగా ప్రకటనలు విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధికారిక వివరణ
ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తున్నాయి.
ఇంతలో, ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి.… pic.twitter.com/cMYqQpmMLX
— FactCheck_Telangana (@FactCheck_TG) April 19, 2026
