మార్నింగ్‌వాక్‌కు వెళ్తుండగా టీడీపీ నేత హత్య…గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
- bheemraj
- Published On : January 28, 2021 / 01:35 PM IST
TDP leader killed in Janagam : జనగాంలో దారుణం జరిగింది. జనగామ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు పులిస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న పులిస్వామిని..దారి కాచి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పులి స్వామి రాక కోసం మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఆ తర్వాత.. వచ్చిన బైక్ పై వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్ వదిలేసి పారిపోయారు. ఈ హత్యకు భూ వివాదాలు కారణం అయి ఉంటారని పోలీసు భావిస్తున్నారు.
హత్యకు గావించపడ్డ పులిస్వామీ 2005 లో టీడీపీ నుండి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఫ్లోర్ లీడర్ గా పని చేశారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా టీడీపీ లోనే కొనసాగుతున్నారు.
ఉదయం 6 గంటల సమయంలో హత్య జరగడంతో జనగామలో జనం భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
