TG 10th Results 2026 : తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. రిజల్ట్స్ తేదీపై క్లారిటీ వచ్చేసింది..
TG 10th Results 2026 : తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడనుంది.
- Harishth Thanniru
- Published on- April 22, 2026 / 01:46 PM IST
TS 10th Results 2026
- తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్
- పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్
- మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెలువడే ఛాన్స్
TG 10th Results 2026 : తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడనుంది. టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 16న పరీక్షలు ముగియగా.. మూల్యాంకన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
Also Read : Rythu Bharosa 2nd Installment: రైతుభరోసాపై ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి..
తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఈనెల 16వ తేదీతో ముగిశాయి. మొదటి విడతలో చేపట్టిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. మిగిలిన సైన్స్, సోషల్ సబ్జెక్టుల మూల్యాంకనం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత , స్కానింగ్ ప్రక్రియ ఏప్రిల్ 25 లోపు పూర్తి కానుందని అధికారులు తెలిపారు.
మూల్యాంకనం పూర్తయిన తరువాత మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) ప్రక్రియ వేగంగా పూర్తిచేసి, మే తొలివారంలో ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. మే 4 లేదా 5 తేదీల్లో టెన్త్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
