Telangana Budget 2026-27 : బడ్జెట్‌లో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క.. ఆ పథకం అమల్లోకి..
Telangana Budget 2026-27 : అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు.
- Harishth Thanniru
- Updated on- March 20, 2026 / 01:05 PM IST
intermediate students Mid-day meal scheme
intermediate students Mid-day meal scheme : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.3,24,234 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుకాగా.. మూలధనం వ్యయం రూ.47,267కోట్లుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో భట్టి విక్రమార్క ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు.
Also Read : Telangana Budget 2026-27 : తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని, విద్యార్థుల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు.
బ్రేక్‌ఫాస్ట్ కూడా..
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజుల పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
