Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్?

Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఖాళీ బెర్తులు, మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు, శాఖల కేటాయింపుపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

Telangana Cabinet Expansion

  • కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. బెర్తులు ఎవరికి?
  • మంత్రి పదవులపై ఆశలు.. సీఎం రేవంత్ నెక్ట్స్ మూవ్ ఏంటి?
  • ఖాళీ శాఖలు ఎవరి చేతికి?.. తెలంగాణలో ఆసక్తికర చర్చ
  • మంత్రి పదవుల రేసు.. ఎవరికి కలిసొస్తుందో?

Telangana Cabinet Expansion : కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం మరింత ఉత్కంఠ రేపుతోంది. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తప్పించడంతో మొత్తం 3 బెర్తులు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? :
అయితే, మంత్రివర్గ విస్తరణపై ఇప్పటివరకు సీఎం రేవంత్ సర్కార్ ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Cabinet Expansion) కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? ఎప్పుడు విస్తరణ ఉంటుందనే అంశాలపై క్లారిటీ లేదు.

ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందనే వారి సంఖ్య పెరుగుతోంది. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు పార్టీకి అందించిన సేవలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు భవిష్యత్ కూర్పులో కీలకంగా మారనుంది.

Read Also : Konda Surekha : బర్తరఫ్‌పై కొండా సురేఖ రియాక్షన్.. రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని..!

కొండా మంత్రి శాఖలు ఎవరికి? :

ఇదిలా ఉంటే.. కొండా సురేఖ శాఖ దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల భవితవ్యంపైనా కూడా నేతల్లో ఆసక్తి నెలకొంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో తెలియదు.. అప్పటివరకు ఈ శాఖలను సీఎం తన వద్దే ఉంచుకుంటారా? లేక ప్రస్తుత మంత్రుల్లో ఎవరికైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? :
ఒకవేళ తాత్కాలికంగా శాఖల పునర్విభజన జరిగినట్టు అయితే.. అది పూర్తిస్థాయి మంత్రివర్గ కూర్పుకు సంకేతమని భావించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో విస్తరణ జరిగితే.. కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది కూడా కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన అంశంగా మారనుంది.

ఏది ఏమైనా తెలంగాణ రాజకీయ పరిణామాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రస్తుత వినిపిస్తున్న అంచనాలు అన్నీ కేవలం రాజకీయ చర్చలే. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అది ఎప్పుడు జరుగుతుంది? ఎవరికి బెర్తులు దక్కుతాయి? ఖాళీ శాఖల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనే ప్రశ్నలకు అధికారిక నిర్ణయం వచ్చేవరకు ఆగాల్సిందే..