తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఈవో వికాస్ రాజ్ ప్రెస్మీట్
ఈ నెల 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు
- tony bekkal
- Updated on- November 28, 2023 / 06:44 PM IST
Telangana CEO Vikas Raj: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ ఎన్నికల గురించి మరింత సమాచారం
* ఈనెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్
* 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బరిలో 2,290 మంది అభ్యర్థులు
* ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్
* రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.26 కోట్లు
* ఇందులో 1,63,01705 మహిళలు.. 1,62,92,418 పురుషులు
* 2,676 మంది ట్రాన్స్జెండర్లు
* రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,655
* 12,000 వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం
* తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు 9,99,667 మంది
మరిన్ని వివరాల కోసం.. వీడియో చూడండి.
