KTR : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు కండిషన్లు ఇవే.. విచారణ ఆగస్టు 25కి వాయిదా..
Formula E Car Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో భాగంగా నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం చేపట్టిన విచారణ ముగిసింది.
Formula E-Car Race Case
Formula E Car Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో భాగంగా నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం చేపట్టిన విచారణ ముగిసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అయితే, కేటీఆర్ లక్ష పూచీకత్తు, రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు తెలుస్తోంది.
Also Read : Rega Kantha Rao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కేసులో ట్విస్ట్..
ఫార్ములా ఈ-కార్ రేసు, ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్ఎండీఏకు సుమారు 55కోట్లకుపైగా నష్టం జరిగిందని ఏసీబీ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చులు చేసి ఆడిట్ ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు.. మూడు సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారని ఆరోపించింది.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను ఏ-1 గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్ షీట్ ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో మొత్తం 14మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఛార్జ్‌షీట్ ధాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ఏసీబీ కోర్టు ట్రయల్ మొదలు పెట్టనుంది.
