CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే.. ఎల్‌నినో ప్రభావంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

Telangana CM Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. గురువారం ఎల్‌నినో (Elnino) కారణంగా తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రులు, సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరించారు.

Also Read : Overseas Vidyanidhi Scheme : బీసీ విద్యార్థులకు శుభవార్త.. రూ.20లక్షల స్కాలర్‌షిప్.. ఈనెల 31వరకు అవకాశం..

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్‌నినో.. కొవిడ్ లాంటి సంక్షోభం. అన్ని రంగాలపై ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. దీని ఎఫెక్ట్ 100 దేశాలపై ఉంటుందని ఐక్యరాజ్య సమితి చెప్పింది. గ్లోబల్ వార్మింగ్ ద్వారానే ఎల్‌నినో పవిపత్తు.. తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య వస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంపైనా ఎల్ నినో ప్రభావం ఉంటుంది. అందుకే ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఈ ప్రకృతి విపత్తును మనం ఎదుర్కోబోతున్నాం. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. అక్టోబర్ నెలలో ఇంత విద్యుత్ డిమాండ్ గతంలో ఎప్పుడూ లేదు. సాధారణంగా అక్టోబర్ నెలలో 15వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఇప్పుడు అది 20వేల మెగావాట్లకు పెరిగింది. అయినప్పటికీ సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ తో పాటు నీటి అవసరాలు పెరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.