CM Revanth Reddy: సచివాలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం
సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలిసుల గౌరవ వందనం స్వీకరించి సెక్రెటేరియట్ లోకి రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. కాగా, ఈరోజే తెలంగాణ మొదటి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
- tony bekkal
- Published On : December 7, 2023 / 04:37 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశం ముగించుకుని, అటు నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయడానికి రేవంత్ సొంత కారులోనే వచ్చారు. ఆ కారుకే పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు.
సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలిసుల గౌరవ వందనం స్వీకరించి సెక్రెటేరియట్ లోకి రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. కాగా, ఈరోజే తెలంగాణ మొదటి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
#TelanganaCM #RevanthReddy arrived at the Secretariat pic.twitter.com/jzbwgWaS45
— Aneri Shah (@tweet_aneri) December 7, 2023
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం మొదటి గేటు నుంచి ప్రధాన భవనం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సచివాలయం మొత్తం ఆయన కలియతిరిగారు. కాగా, కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. అయితే మొదటి కేబినెట్ సమావేశంపై ఏ ఏ అంశాలపై జరగనుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల మీదనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Chief Minister Revanth Reddy assumes office amidst vedic chants@DeccanChronicle @oratorgreat @TelanganaCMO @revanth_anumula #TelanganaCM #RevanthReddy pic.twitter.com/U6tfyshLkV
— Pinto Deepak (@PintodeepakD) December 7, 2023
