CM Revanth Reddy : ఫామ్‌హౌస్‌ నుంచి శుక్రాచార్యుడు కుట్రలు.. దాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కేవలం మనకోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది.. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేస్తూ ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కేవలం మనకోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : PM Modi : భారత్‌లో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. దేశం 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి.

హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. హైదరాబాద్ విస్తరణతో సికింద్రాబాద్ కలిసి జంట నగరాలుగా అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 60శాతం ఈ ప్రాంతం నుంచే వస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ అని అన్నారు. 1908లో తుఫాన్ వ‌చ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ నాటి నిజాం న‌వాబు మూసీ న‌ది పైన నిర్మాణాలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచ‌డం వ‌ల్ల శత్రు దుర్భేద్యంగా మారింది.. ఆ నాటి పాల‌కులు సైబ‌రాబాద్‌ను నిర్మించి గొప్ప న‌గ‌రాన్ని ప్ర‌పంచానికి అందించారు. హైటెక్ సిటీ, అవుట‌ర్ రింగ్ రోడ్డు, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, జీనోమ్ వ్యాలీ లాంటివి కొందరు వ‌ద్దే వ‌ద్దన్నారు.

ఆ నాటి పాల‌కులు హైటెక్ సీటీ, అవుట‌ర్ రింగ్, అంత‌ర్జాతీయ‌ ఎయిర్ పోర్టు , జీనోమ్ వ్యాలీ లాంటి తీసుకురాక‌పోతే ఈ నాడు 10 ల‌క్ష‌ల మందికి ఉపాధి ల‌భించేదా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రావ‌ణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభావుడులా ఆనాడు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.. ఇప్పుడు శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉండి మారీచుడు, సుభావుడిని పంపించాడు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామ‌ని పెద్ద రాక్ష‌సుడు, చిన్న రాక్ష‌సులు అంటున్నారు.. ప్ర‌పంచానికి ఒక దిక్సూచి‌గా ఫ్యూచ‌ర్ సిటీని గొప్ప న‌గ‌రంగా తీర్చిద్దాల‌న్న సంకల్పంతో ప్ర‌భుత్వం ఉంది.. కళ్ల‌లో నిప్పులు పోసుకుని, క‌డుపులో విషం నిప్పుకొని ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామంటున్నారు.. వాళ్ల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.. వాళ్లకు గ‌త‌మే త‌ప్ప‌ భ‌విష్య‌త్తు లేదు.. ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామంటే వ‌చ్చేసారి ప్ర‌తిప‌క్ష హోదా కూడారాదు.. ఈ ప్రాంత ప్ర‌జ‌లు బండ‌కేసి కొడ‌తారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

స‌రిగా 150 రోజుల్లో ప్యూచ‌ర్ సిటీ అథారిటీ డెవ‌ల‌ప్మెంట్ కార్యాల‌యాన్ని ప్రారంభించుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. 2034 నాటికి వ‌న్ ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీకి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ కీల‌కం కావాలి. తొల‌క‌రి వ‌ర్షం ప‌డితేనే హైద‌రాబాద్ లో రోడ్డులు ఎక్క‌డిక్క‌డ స్తంభించిపోయాయి. కిలోమీట‌ర్ దూరానికి రెండు నుంచి నాలుగు గంట‌ల ప‌ట్టింది. 100 కోట్లకు ఎక‌రం అమ్మిన‌మ‌ని జ‌బ్బ‌లు చ‌ర్చుకున్న వాళ్లు నిన్న‌టి వ‌ర‌ద‌ల‌కు స‌మాధానం చెప్పాలని రేవంత్ అన్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకుని, కుంట‌ల‌ను చెర‌పట్ట‌డం వ‌ల్ల‌నే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాల‌నీలు, బ‌స్తీల‌కు వ‌చ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.


ప్ర‌భుత్వ భూములు, చెరువుల‌ను, కుంటల‌ను ఆక్ర‌మించుకున్న వారి క‌ట్ట‌డాల‌ను నిర్ధాక్ష్య‌ణంగా కూలుస్తున్నాం.. మేం ఎవ‌రైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..? ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువుల‌ను పున‌రుద్ద‌రిస్తున్నాం. లేక్ ఎక‌నామీని త‌యారు చేస్తున్నాం.. మ‌హిళా సంఘాలు వ్యాపారం చేసుకునేలా చేస్తున్నాం.. రాజేంద్ర‌న‌గ‌ర్‌లో చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి పునరుద్ద‌రించాం.. కూక‌ట్‌ప‌ల్లి నల్లచెరువు, అంబ‌ర్ పేట‌లో బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్దించామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ నాయ‌కుడు ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి బ‌తుక‌మ్మ కుంట‌ను ఆక్ర‌మించి హెలికాఫ్ట‌ర్‌లో పూలు చ‌ల్లాడ‌ని, గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు రాసి ఇచ్చింది. బ‌తుక‌మ్మ కుంట‌ను దుర్మార్గులు చెర‌ప‌డితే వాళ్ల ప‌ని ప‌ట్టి పున‌రుద్దించాం. గండిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ను గొప్ప వ్య‌క్తులు ఆక్ర‌మిస్తే వాళ్ల‌ను ఖాళీచేయించ‌దానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.


ముంబ‌యిలో వ‌ర్షం వ‌స్తే జ‌నం బ‌య‌ట‌కురాని ప‌రిస్థితి ఉంది. చెన్నైలో వ‌ర్షం వ‌స్తే ప‌డ‌వ‌ల్లో తిరుగుతున్నారు. కొల్‌క‌త్తాలో శాంతిభ‌ద్ర‌త‌లు లేవు. బెంగ‌ళూరులో ట్రాఫిక్ జామ్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో క‌బ్జాకోరుల ప‌నిప‌డుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌పంచం మ‌న వైపు చూస్తుంది.. 10 జూన్ 2026వ తేదీన సువ‌ర్ణ అధ్యాయాన్ని సృష్టించామని చెప్పారు. గ్రీన్‌ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీల‌తో పాటు ప్ర‌పంచంలోని ప్ర‌సిద్ది గాంచిన‌ 500 పెద్ద కంపెనీల‌ను ఫ్యూచ‌ర్ సిటీకి ర‌ప్పించ‌బోతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
గ్లోబ‌ల్ స‌మ్మిట్ పెట్టి ప్ర‌పంచ దేశాల‌ను ఇక్క‌డికి రప్పించాం. ఫ్యూచ‌ర్ సిటీలో కొన్ని గ్రామాల‌ను ఈరోజు క‌లిపాం. ఫ్యూచ‌ర్ సిటీని ప్ర‌పంచానికి గొప్ప న‌గ‌రంగా రాణిస్తుంద‌న‌డంలో అనుమానం లేదు. అడ్డుప‌డిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటు ఈ ప్రాంతం వాళ్లే వెళ్తారు. ఈ న‌గ‌రాన్ని ఇక్క‌డి వాళ్లే కాపాడుకుంటారు. ప్ర‌పంచానికి దిక్సూచిగా ఈ ప్రాంతం ఉంటుంది. కాలుష్య ర‌హిత గొప్ప‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం. వీలైన‌ప్పుడ‌ల్లా ఫ్యూచ‌ర్ సిటీ అథారిటీ కార్యాల‌యానికి వ‌స్తాను.. డీప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి శ్రీధ‌ర్ బాబు వారానికోసారి ఇక్క‌డికి వ‌స్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.