×
Ad

Telangana Corona : తెలంగాణలో అదుపులో కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే

అత్యధికంగా హైదరాబాద్ లో 22 కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం...

  • Published On : March 24, 2022 / 09:10 PM IST

Tg Covid

Telangana Corona : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,444 కరోనా పరీక్షలు నిర్వహించగా 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 22 కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,038 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,308 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Read More : AP Covid : ఏపీలో కరోనా కథ మారింది.. ఐదు జిల్లాల్లో సున్నా కేసులు

మరోవైపు… భారత్ లో కోవిడ్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అయినా కొత్తగా కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,938 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 6.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,938 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 2,531 మంది కరోనా నుంచి కోలుకోగా… 67 మంది మృతి చెందారు.

Read More : Telangana Corona Numbers : తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే

జిల్లాల వారీగా కేసుల వివరాలు : – ఆదిలాబాద్ 01. భద్రాద్రి కొత్తగూడెం 00. జీహెచ్ఎంసీ 22. జగిత్యాల 02. జనగామ 00. జయశంకర్ భూపాలపల్లి 00. జోగులాంబ గద్వాల 01. కామారెడ్డి 00. కరీంనగర్ 02. ఖమ్మం 02. కొమరం భీం ఆసిఫాబాద్ 00. మహబూబ్ నగర్ 02. మహబూబాబాద్ 00. మంచిర్యాల 02. మెదక్ 00. మేడ్చల్ మల్కాజ్ గిరి 01. ములుగు 01. నాగర్ కర్నూలు 00. నల్గొండ 00. నారాయణపేట 00. నిర్మల్ 00. నిజామాబాద్ 00. పెద్దపల్లి 00. రాజన్న సిరిసిల్ల 00. రంగారెడ్డి 07. సంగారెడ్డి 01. సిద్దిపేట 02. సూర్యాపేట 00. వికారాబాద్ 00. వనపర్తి 00. వరంగల్ రూరల్ 00. హన్మకొండ 03. యాదాద్రి భువనగిరి 00. మొత్తం : 49