TG EDCET 2026 Results : తెలంగాణ ఎడ్‌సెట్ -2026 ఫలితాల వచ్చేశాయ్.. 96.95శాతం మంది క్వాలిఫై.. డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చెక్ చేయండి
TG EDCET 2026 Results : తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాల విడుదలయ్యాయి. 28,446 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
- Harish Thanniru
- Updated on- May 30, 2026 / 01:41 PM IST
Telangana Ed CET Results 2026 Released direct link at edcet.tgche.ac.in
TG EDCET 2026 Results : తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు (TG EdCET 2026 Results) విడుదలయ్యాయి. రెండేళ్ల బీఈడీ కోర్సు కోసం ప్రతిఏటా TG EdCET పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మే 12న పరీక్షలు నిర్వహించారు. 35,600 మంది ఈ పరీక్షకోసం దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ణారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి శనివారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 96.95 శాతం ఉత్తీర్ణతో 28,446 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఫలితాల్లో భాగంగా కొత్తగూడెంకు చెందిన బానోత్ అజిత్ సాయి కృష్ణ కు 1st ర్యాంక్ సాధించగా.. సూర్యాపేటకు చెందిన పోతుగంటి తరుణ్ కుమార్ రెండో ర్యాంక్ సాధించారు. ఫలితాలను https://edcet.tgche.ac.in ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
