CM Revanth 10th Exams : సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండవు.. కారణమిదే..!

CM Revanth 10th Exams : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండబోవన్నారు.

telangana education reforms cm revanth reddy says no 10th board exams in state very soon

CM Revanth 10th Exams : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై రాష్ట్రంలో పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవు. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర విద్యావిధానంలో కీలక మార్పులు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. దీనిలో భాగంగా ఇకపై తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండబోవంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామంటూ మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో వెల్లడించారు.

దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విద్యా విధానాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. ఇక రాష్ట్రంలో కేవలం 12వ తరగతిలో మాత్రమే బోర్డు పరీక్షలు ఉంటాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అంశాలను అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇది తుది నివేదిక కాదని.. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో.. కమిషన్ రాష్ట్ర విద్యా రంగంలో అనేక వినూత్న సంస్కరణలను సూచించింది. పాత ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు పరిధిలోకి తీసుకురావాలని నివేదిక స్పష్టం చేసింది. అలాగే నర్సరీ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని పక్కాగా అమలు చేయాలని ఎడ్యుకేషన్‌ కమిషన్‌ నివేదిక సూచించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండబోవని ప్రకటించారు.