Future City Headquarters: భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు
HYD Future City: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు (FCDA Headquarters) మరో కీలక మైలురాయిని చేరుకుంది.
- V Santhosh Kumar
- Updated on- June 10, 2026 / 02:48 PM IST
Telangana future city takes major step with fcda headquarters inauguration
- నేడు FCDA కార్యాలయం ప్రారంభం
- ఆరు నెలల్లో భవన నిర్మాణం
- ప్రపంచ స్థాయి నగర లక్ష్యం
Future City Hyerabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (Future City Headquarters) ప్రధాన కార్యాలయం బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా అభివర్ణించారు.
*Telangana Rains: తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్.. మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన FCDA ప్రధాన కార్యాలయం కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పూర్తవడం విశేషం. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రణాళికాబద్ధ నగర నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ కార్యాలయానికి ఇప్పటికే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ‘నెట్ జీరో’ గుర్తింపు లభించింది.
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. సాయంత్రం 5:30 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలకు వివరించనున్నారు.
