Heatstroke Aid: వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం.. దరఖాస్తు ప్రక్రియ, కావాల్సిన పత్రాలు ఇవే..

మరణం సంభవించిన వెంటనే స్థానిక వీఆర్ వో లేదా తహశీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి.

  • Published on- May 24, 2026 / 04:32 PM IST

Heatstroke Aid: వడదెబ్బతో చనిపోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. మరి ఈ పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేం పత్రాలు సమర్పించాలి? తెలుసుకుందాం.

వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ద్వారా ప్రభుత్వం ఈ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. 4 లక్షల రూపాయల పరిహారం పొందాలంటే మాత్రం కొన్ని రూల్స్ మస్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. వడదెబ్బతో వ్యక్తి మరణించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేయించాలి. రిపోర్ట్ లో ‘వడదెబ్బ వల్లే మరణం సంభవించింది’ అని స్పష్టంగా ఉండాలి.

ఈ డాక్యుమెంట్స్ మస్ట్..
* ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన శపపరీక్ష రిపోర్ట్ ఉండాలి
* వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించాలి
* మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) ధ్రువీకరించాల్సి ఉంటుంది
* మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రం
* మృతుడి, కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డుల జిరాక్సులు
* పరిహారం జమ కావడానికి బ్యాంక్ పాస్‌ బుక్ వివరాలు
* వారసుల వివరాల కోసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు ప్రక్రియ..
* మరణం సంభవించిన వెంటనే స్థానిక వీఆర్ వో లేదా తహశీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి
* పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి తహశీల్దార్ ఆఫీస్ లో దరఖాస్తు ఇవ్వాలి
* రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపిస్తారు
* కలెక్టర్ ఆమోదం పొందాక 4 లక్షల రూపాయల పరిహారం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 2.5లక్షల మందికి శుభవార్త.. జూన్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభం..