Telangana Women Commission: మహిళా కమిషన్‌లో అమరవీరుల కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
శశికళ, సదా లక్ష్మి, రాధా బాయ్, ఆశాయ్ షకీరాలను మిగతా కమిషన్ మెంబర్లుగా నియమించింది రేవంత్ సర్కార్.
- Naveen
- Updated on- May 11, 2026 / 08:03 PM IST
Telangana Women Commission: రాష్ట్ర మహిళా కమిషన్ కు కొత్త టీమ్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సీనియర్ నేత కే కేశరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. ఆరుగురిని మెంబర్లుగా నియమించింది. ఇక, మహిళా కమిషన్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చోటు కల్పించింది సర్కార్. కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు దివంగత శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను ఎంపిక చేసింది. శశికళ యాదవ రెడ్డి, సదా లక్ష్మి, రాధా బాయ్, ఆశాయ్ షకీరాలను మిగతా కమిషన్ మెంబర్లుగా నియమించింది రేవంత్ సర్కార్.
మహిళా కమిషన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా సీఎస్ రామకృష్ణా రావు జీవోను విడుదల చేశారు. ఐదేళ్ల పాటు ఈ మహిళా కమిషన్ ఉండనుంది. చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని, ఆరుగురిని మెంబర్లుగా నియమించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ వారసురాలు చిట్యాల శ్వేతలను కమిషన్ మెంబర్లుగా నియమించింది ప్రభుత్వం.
కొంత కాలంగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇవాళ మహిళా కమిషన్ ను అపాయింట్ చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని కమిషన్లను భర్తీ చేస్తోంది ప్రభుత్వం. గతంలో మాదిరి కాకుండా సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ మహిళా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులను నియమించారు సీఎం రేవంత్. మహిళా కమిషన్ లో అమరవీరుల కుటుంబాలకు చోటు కల్పించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: సర్కార్ కీలక నిర్ణయం.. ప్రైవేటు వెంచర్లలోనూ పేదలకు సొంతిల్లు.. త్వరలోనే అమలు
