Ration Cards Cancel: వారికి షాక్ ఇచ్చిన సర్కార్.. రేషన్ కార్డులు కట్.. కారణమిదే.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండి
Ration Cards : రేషన్ కార్డుదారులకి బిగ్ అలర్ట్.. సర్కార్ వారి కార్డులు రద్దు చేసింది.
- Dharani Pilli
- Updated on- May 25, 2026 / 04:58 PM IST
Telangana Government Cancels Ration Cards of Ineligible Beneficiaries across the state
- రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్
- వారి రేషన్ కార్డులు రద్దు
- కార్డులు క్యాన్సిల్ చేసిన రేవంత్ సర్కార్
Ration Cards : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు ఏవైనా సరే.. లబ్ధి పొందాలంటే కావాల్సిన ముఖ్యమైన అర్హత రేషన్ కార్డు కలిగి ఉండటం. రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవీ రావు. ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేస్తాయి. ప్రభుత్వ పథకాల కోసం ఆర్థికంగా బాగున్న వారు సైతం అక్రమంగా రేషన్ కార్డులను పొందుతారు. ఇలాంటి వారిపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టి అనర్హులైన వారి రేషన్ కార్డులను క్యాన్సిల్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనర్హులైన రేషన్ కార్డుదారులను గుర్తించి.. వారి కార్డులను రద్దు చేస్తోంది.
* సర్కార్ సంచలన నిర్ణయం.. లక్షల రేషన్ కార్డులు రద్దు.. మీ కార్డు ఉందేమో చెక్ చేసుకొండి
తెలంగాణలో గత కొంతకాలంగా రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరు ఆదాయపన్ను చెల్లింపుదారులు, అధిక జీతం పొందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులను పొందినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ వీరి రేషన్ కార్డులను రద్దు చేస్తోంది. అక్రమంగా రేషన్ కార్డు పొందిన వారిని గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారిస్తున్నారు. వారి పరిశీలనలో అనర్హులుగా తేలితే అలాంటి వారి రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు.
వీరంతా అనర్హులు..
- పరిమితికి మించి భూమి ఉండటం,
- రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండటం,
- ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రేషన్ కార్డు పొందడానికి అనర్హులు.
చాలా ప్రాంతాల్లో అత్యధిక జీతాలు పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డు పొందినట్లు గుర్తించిన అధికారులు.. వారి కార్డులను రద్దు చేస్తున్నారు. అలానే కొంతమంది తప్పుడు సమాచారంతో రేషన్ కార్డు పొంది.. ఏళ్ల తరబడి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరిని కూడా ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ కార్డు పొందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. లక్షల్లో జీతం పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొంతమంది ఇప్పటివరకు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లో కొనసాగడం వల్ల వారి వివరాలు తెలియలేదు. కానీ వీరిలో కొందరు ప్రత్యేకంగా కార్డు పొందడంతో ఇప్పుడు వీరి గుట్టు రట్టయింది. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు.
వీరి రేషన్ కార్డు కట్
- గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి ఉన్న వారి రేషన్ కార్డులు రద్దు
- 7.20 ఎకరాల కంటే ఎక్కువ కుష్కి భూమి ఉన్నా కార్డులు రద్దు చేస్తారు
- వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఉన్నా
- ఆదాయపన్ను చెల్లిస్తున్న వారి రేషన్ కార్డులను రేవంత్ సర్కార్ రద్దు చేస్తుంది.
