Telangana Government: తెలంగాణ రైతులకు కరువు సాయం.. ఎకరానికి రూ. 10 వేలు.. అధికారులతో సీఎం సమీక్ష

తెలంగాణ(Telangana Government) రైతులకు కరువు సాయం కింద ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.

Telangana government decided to give 10,000 rupees to farmers as drought relief.

Telangana Government: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై సమగ్ర నివేదిక రూపొందించిన ప్రభుత్వ యంత్రాంగం, బాధిత రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా 320 మండలాల్లో వర్షాభావం ఉండగా, అందులో 117 మండలాల్లో అత్యంత తీవ్రమైన కరువు తాండవిస్తోందని అధికారులు వెల్లడించారు. మొత్తం 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేసిన అధికారులు, వాడిపోతున్న 7 లక్షల ఎకరాల పంటలకు కనీసం ఒక్క తడికైనా సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Kothagattu Toll Plaza: కరీంనగర్-వరంగల్ హైవేపై నేటి నుంచి టోల్ బాదుడు.. కొత్తగట్టు వద్ద వసూళ్లు షురూ.. ఛార్జీల వివరాలు ఇవే!

రూ. 2,170.68 కోట్లతో కరువు ఉపశమన ప్రణాళిక.. మంత్రులతో సీఎం కీలక భేటీ:

పంట నష్ట పరిహారంతో పాటు పశుసంవర్ధక శాఖ సహాయక చర్యలు, తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కలిపి మొత్తం రూ. 2,170.68 కోట్లు అవసరమవుతాయని అధికారులు(Telangana Government) అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణ చర్యల నిమిత్తం ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. కోటి చొప్పున నిధులు కేటాయించాలని నివేదికలో సూచించారు. అధికారుల నివేదికలోని ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపేందుకు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం రైతులకు అందించే కరువు సహాయక చర్యలపై ప్రభుత్వం అధికారికంగా కీలక ప్రకటన చేయనుంది.